శ్రీ రామదాస్

“శ్రీ రామదాసు” గా ప్రసిద్ధి చెందిన కంచెర్ల గోపన్న, 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము కలదు. తెలుగులో కీర్తనలకు ఈయన ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు.


వీడియోస్
చిత్రపటాలు
వీడియోస్
చిత్రపటాలు