శ్రీ శరభ సాళువ స్వామి

సంస్కృత సాహిత్యం ప్రకారం, హిందూ పురాణాలలో శరభ అనేది సగం సింహాన్ని మరియు సగం పక్షిని పోలి,  ఎనిమిది కాళ్లతో, సింహం లేదా ఏనుగు కంటే శక్తివంతమైనది గా, ఒక్క దూకుడు లో ఒక లోయను దాటగలిగే సామర్ధ్యంతో, ఒక మృగం లా వర్ణించబడింది.  ఇతర సాహిత్యాలలో శరభ ను ఎనిమిది కాళ్ల జింకగా అభివర్ణించారు.

మరొక కథ ప్రకారం, శరభను ఎదుర్కోవటానికి మరియు ఓడించడానికి విష్ణువు భయంకరమైన గండబెరుండ పక్షి-జంతువు రూపాన్ని స్వీకరించాడని వివరిస్తుంది.

బౌద్ధమతం ప్రకారం, జాతక కథలలో, శరభ బుద్ధుని మునుపటి జన్మగా ప్రస్తావించబడింది.

పూర్వం యోధులను శరభ తో పోల్చేవారు. మహాభారత ఇతిహాసం లో, శరభ యొక్క రూపం ఎనిమిది కాళ్ళతో, శిరస్సు పైన కళ్ళ తో, అడవిలో నివసిస్తూ, పచ్చి మాంసాన్ని తింటూ, సింహాలను చంపే రాక్షసి గా వర్ణించబడింది. అలాగే, ఇది క్రౌంచ పర్వతం మీద, రాక్షసి గా కాకుండా, గంధమదన పర్వతంపై సింహాలు మరియు పులులతో పాటు సాధారణ మృగం గా నివసించినట్లు పేర్కొనబడింది.

శరభ,రామాయణ ఇతిహాసంలో ,ఒక వానర రాజుగా పేర్కొనబడింది.  అంతే కాకుండా, యోధులు గా, వానరులు గా, రాక్షసులు గా, నాగులు గా, అలాగే విష్ణువు మరియు బుద్ధుడి అవతారాలలో ఒకటి గా పేర్కొనబడినది.

శివ పురాణం లో శరభ ను, వెయ్యి చేతులు, సింహపు ముఖం మరియు జూలు, రెక్కలు, మరియు ఎనిమిది కాళ్ళు గల జీవిగా వర్ణించడం జరిగింది. శరభ ఉపనిషద్ లో శరభ ను, రెండు తలలు, రెండు రెక్కలు, సింహం యొక్క ఎనిమిది పదునైన పంజాలు గల కాళ్ళు మరియు పొడవాటి తోకతో సంబోధించారు. కాలిక పురాణం శరభను నలుపు రంగులో, నాలుగు కాళ్ళు క్రిందికి, నాలుగు కాళ్ళు పైకి వుండి, భారీ శరీరంతో వర్ణించింది. దీనికి పొడవాటి ముఖం మరియు ముక్కు, గోర్లు, ఎనిమిది కాళ్ళు, ఎనిమిది దంతాలు, వతైన జూలు మరియు పొడవాటి తోకను కలిగి ఉంటుంది. ఇది పదేపదే ఎంతో ఎత్తుకు దూకుతూ, బిగ్గర గా కేకలు వేస్తుంది.

శరభేశ్వరమూర్తి (శరభ గా పిలువబడే శివుడి అవతారం) యొక్క ప్రతిమ పురాణం, ఖమిక ఆగమ మరియు శ్రీతత్వనిధి వంటి గ్రంథాలలో ప్రత్యేకంగా నిర్వచించబడింది.  ఖమిక ఆగమ లో, శరభ బంగారు వర్ణం లో ఉన్న పక్షి రూపం లో, రెండు రెక్కలను విప్పి, రెండు ఎర్రటి కళ్ళు, సింహపు రూపంలో నాలుగు కాళ్ళు భూమిని తాకుతూ, నాలుగు కాళ్ళు పైకెత్తి, జంతువు తోక కలిగినదిగా వర్ణించబడింది. శరీరం యొక్క పై భాగం మానవునిగా చూపబడినా, శిరస్సు మాత్రం కిరీటంతో అలంకరించబడిన సింహపు ముఖం కలిగి ఉంటుంది. ఇరు వైపులా దంతాలు వుండి, కాళ్ళ క్రింద నరసింహ స్వామి చేతులు జోడించినట్టుగా చూపబడింది.

శ్రీతత్వనిధిలో, శరభేశ్వరమూర్తికి ముప్పై చేతులు కలిగి, కుడి వైపు చేతులలో పిడుగు, ముష్టి, అభయ, చక్ర , శక్తి, బెత్తం, ముల్లుకర్ర, కత్తి, ఖాట్వాంగా, గొడ్డలి, అక్షమాలా, ఎముక, విల్లు, ముసల మరియు అగ్నిని పట్టుకోగా, ఎడమ వైపు చేతులలో ఉరి, వరదా, జాపత్రి, బాణం, జెండా, మరొక రకమైన కత్తి, ఒక పాము, ఒక తామర పువ్వు, కపాలము, పుస్తక, నాగలి మరియు మృదంగాన్ని దుర్గ దేవి చుట్టుముడుతూ కలిగి ఉంటాడు. ఈ రూపం అదృష్టాన్ని పొందటానికి, అన్ని వ్యాధులను నయం చేయడానికి మరియు శత్రువులందరినీ నాశనం చేయడానికి ప్రశంసించబడింది.

ఇటువంటి మరెన్నో పురాణాలలో శరభ ను గూర్చి వివరించడం జరిగింది.

అన్నిటి లోనూ ప్రాచుర్యం లో ఉన్న కథ శివ పురాణం లోనిది.

శివ పురాణం ప్రకారం, అసురుల రాజు అయిన హిరణ్యకశిపుడి సంహారం, నరసింహ స్వామి యొక్క ఆగ్రహాన్ని తీర్చలేదు. ఏమి జరుగుతుందో అని ప్రపంచం భయపడుతుండగా, దేవతలు నరసింహ స్వామిని శాంతింపచేయమని శివుడిని అభ్యర్ధిస్థారు. శివుడు తన భయానక రూపాలలో ఒకటి అయిన వీరభద్ర అవతారంలో ముందుకు రాగా, అది విఫలమౌతుంది. అప్పుడు శివుడు, మానవ-సింహా-పక్షి రూపం లో అవతరించి, తన స్త్రీ శక్తులైన ప్రత్యాంగిర మరియు సూలిని లను తన రెక్కలుగ ఏర్పరచుకొని, నరసింహ స్వామి పై దాడి చేస్తాడు. ప్రత్యాంగిరను ఆయుధంగా ఉపయోగించి, నిరసింహుడిని బంధించి సత్తువ కోల్పోయేల చేస్తాడు. దాంతో నరసింహ స్వామి శివుడికి భక్తుడిగా మారుతాడు. అప్పుడు, శివుడు నరసింహ స్వామి శిరచ్ఛేదనం చేసి, చర్మాన్ని తొలచి, వస్త్రంగా ధరిస్తాడు. నరసింహా స్వామి అవతారం యొక్క సంహారం తరువాత విష్ణువు తిరిగి తన సాధారణ రూపాన్ని స్వీకరించి, తన నివాసానికి విరమించుకుంటాడు. అప్పటినుండి, శివుడు అవతరించిన ఈ రూపాన్ని, శరభ సాళువ స్వామి గా, శరభేశమూర్తి గా, లేదా సింహగ్న మూర్తి గా, పిలువ బడ్డాడు.

శివ పురాణం లోనే కాక, లింగ పురాణం మరియు శరభ ఉపనిషద్ లలో కూడా నరసింహ స్వామి యొక్క ఈ సంహారం గురించి ప్రస్తావించబడింది.