ముఖపరిచయము

శ్రీ మహా విద్య పీఠం విశిష్టత

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తదంతేవాసి, మహాజ్ఞాని, శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు తదంతేవాసి, శ్రీ శ్రీ శ్రీ విజయయేంద్ర సరస్వతి స్వామి వార్ల ఆశీర్వాదాలతో మరియు మార్గదర్శకత్వంలో, శ్రీ మహా విద్య పీఠం, 1991, వైశాఖ మాసంలో (మే) ఒక ధార్మిక సంస్థగా స్థాపించబడింది.

ఈ సంస్థలో జరుగవలసిన పనులన్నీ మహాగురువుల దర్శకత్వంలో జరుపబడును. ఇక్కడ గురువులచే ప్రపంచానికే కాకుండా, ముఖ్యంగా భారతదేశానికి ప్రాముఖ్యంగా నిలిచే వేద సంస్కృతి భోధన, ధార్మిక ఆచారాలు, సకల దేవత స్వరూపాలుగా కొలువబడే గోవుల పరిరక్షణ, పురాతన దేవాలయాల సంపద మరియు సనాతన ధర్మం యొక్క పరిరక్షణ, పోషణ, మానవజాతి శ్రేయస్సు మరియు పురోగతికి అవసరమైన సంస్కృతి మరియు సంప్రదాయాన్ని కాపాడుట, గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారిచే బోధించబడిన అద్వైత తత్వాన్ని ప్రచారం చేయుట వంటి కార్యక్రమాలు జరిగించబడతాయి. వారి సమర్థవంతమైన మార్గదర్శకత్వంతో, సలహాలతో, వారి ఆశీర్వాదాలు మరియు వారి పవిత్రతపై భక్తితో, మేము వేదసభలు, సంగీత మరియు సాహిత్య కచేరీలు, మాహా విద్య యాగాలు మరియు యజ్ఞాలు వంటి ఆచారాలను నిర్వహించి, తాత్విక మరియు వేద ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయుట మరియు రెండు తెలుగు రాష్ట్రాలలోను గోశాలలు స్థాపించుట జరిగింది.

మహా విద్యా పీఠం యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని దుండిగల్ లో ఉంది. ఈ ప్రాంగణంలో శక్తి పంచాయతన, శ్రీ శరభ సాళువ స్వామి, మరియు శ్రీ విద్యా రామచంద్ర స్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి.

ఈ దేవాలయాలన్నీ మైసూర్ శ్రీ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచిదానంద స్వామి వారు మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వార్లు సందర్శించినారు.

ఇక్కడి వేద సభలు మరియు శాస్త్ర సభలు సాంగ స్వాధ్యాయ భాస్కరులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ డా.విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారి ఆధ్వర్యంలో జరిగించబడును. ప్రవచన చక్రవర్తి, శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆశ్రమాన్ని సందర్శించినారు.

ఈ పీఠంలో, మా గురువులు, గౌరవనీయులు బ్రహ్మశ్రీ కె. రామనాధ శాస్త్రి గారి యొక్క మార్గదర్శకత్వంలో మరియు సలహాలతో, మేము ఆరాధించే శ్రీ విద్యా పరమేశ్వరి దేవి అమ్మవారి యొక్క సమక్షంలో, పవిత్రమైన సందర్భాలలో చండీ హోమాలు చేస్తున్నాము.

ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రీ గోపాల కృష్ణ గురువు గారిని కలిగి ఉండటం మాకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ యొక్క గొప్ప ప్రయోజనం కోసం మాకు ఎంతో మంది భక్తుల మద్దతు ఎప్పుడూ ఉందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము.

శ్రీ పరమాచార్య గారి యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని, మరెన్నో సత్కార్యక్రమాలలో ఎల్లప్పుడూ మహావిద్య పీఠంతో ఉండాలని ఆశిస్తున్నాము, మరియు మా పీఠం యొక్క భక్తులు మరియు దాతలందరికి ఆయురారోగ్య భాగ్యములు, సంపద మరియు విజయంతో ఆశీర్వదించమని ఆ దైవాన్ని మరియు గురువులను ప్రార్థిస్తున్నాము.