గురువు గారి పరిచయం

బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం, చామర్రు గ్రామ వాస్తవ్యులు అయిన శ్రీ చింతపల్లి చంద్రశేఖర శాస్త్రీ గారి కుమారులు.

శ్రీ శర్మ గారు, విధినిర్వహణ పట్ల అంకితభావం కలిగినవారు మరియు బాల్యమునాటి నుండి శ్రీ శర్మ గారు, తన తండ్రిగారైన శ్రీ చింతపల్లి చంద్రశేఖర శాస్త్రీ గారి వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసారు. బ్రహ్మశ్రీ చిట్టి సుబ్రహ్మణ్య ఘనాపాఠి గారి వద్ద కృష్ణ యజుర్వేదాన్ని మరియు బ్రహ్మశ్రీ జోస్యుల సూర్య నారాయణ శాస్త్రి గారి వద్ద సాహిత్యాన్ని, సనాతన ధర్మాన్ని సమర్థించే ప్రవృత్తితో అధ్యయనం చేసారు. పుదుక్కోటై బ్రహ్మశ్రీ కే. రామనాధ శాస్త్రీ గారి వద్ద శ్రీ విద్య పూర్ణ దీక్షను పొంది ఉన్నారు. వీరు ధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మనిబద్ధతతో వాటికి అండగా నిలుస్తూ, స్వయంగా ఒక నిత్యాగ్నిహోత్రిగా నిలబడతారు.

వీరిలోని ఈ లక్షణాలే కంచి పీఠాధిపతి, గురువులు, పరమాచార్యులుగా పిలువబడే శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహాన్ని మరియు దిశానిర్దేశాలను పొందేలా చేసాయి. పరమాచార్య వారి అనుగ్రహంతో మరియు కంచి కామకోటి పీఠం యొక్క ఆశీర్వాదంతో, శ్రీ శర్మ గారు హైదరాబాద్ లోని దుండిగల్, గుంటూరు జిల్లా లోని చామర్రు, మరియు తెనాలి వద్ద గల పెదరావూరు లో శ్రీ విద్యా సాంప్రదాయ వేదికను నిర్మించి, వారి ఆధ్వర్యంలో, నిస్వార్థంగా మరియు అవిరామంగా, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, వాటి పరిరక్షణ మరియు వ్యాప్తి కొరకు కృషి చేస్తున్నారు.