కార్యక్రమాలు

మహా విద్య పీఠం లో నిత్య పూజ సేవలు.

 • అనుజ్ఞ గణపతి స్వామి వారికి ప్రతి సంకట చతుర్థి, ప్రదోషం సమయాన అభిషేకం మరియు హోమం.
 • కాళీ దుర్గ సమేత వీర శరభేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి నాడు ప్రత్యేక అభిషేకం.
 • శ్రీ అభయ విద్య పరమేశ్వరి దేవి కి ప్రతి పౌర్ణమి నాడు అభిషేకం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం మరియు అన్నదాన కార్యక్రమం జరిగించబడును.
 • శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మాసం కృత్తికా నక్షత్రం రోజున అభిషేకం మరియు హోమం.
 • గురువులు, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రతి మాసం అనురాధా నక్షత్రం రోజున వేద స్వస్తి ఆపైన అభిషేకం మరియు సద్గురు పాద పూజ జరుగును.
 • శ్రీ యోగాంజనేయ స్వామి వారికి ప్రతి మాసం పూర్వాభాద్ర నక్షత్రం రోజున అభిషేకం మరియు నాగవల్లి దళ అర్చన.
 • శ్రీ విద్య రామ చంద్ర స్వామి వారికి ప్రతి మాసం పునర్వసు నక్షత్రం రోజున అభిషేకం, శ్రీ రామ తారక హోమం మరియు కళ్యాణం.
 • ప్రతి అమావాస్య నాడు శ్రీ మహావిద్య హోమం.
 • శ్రీ కాళీ దుర్గ సమేత శరభేశ్వర స్వామి వారికి ప్రతి ఆదివారం సా. 4 గంటల నుండి 5 గంటల వరకు రాహు కాల పూజ.
 • ప్రతి మంగళవారం మఠమునందు, బీదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును.
 • పూజ కార్యక్రమాలు.